ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటాడు. అయితే ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. కానీ ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది. నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది.  కుటుంబ సంబధిత సమస్యలు, పని వంటి వాటి వలన మెదడులో రసాయనిక మార్పులు జరిగి, ఒత్తిడికి కారణం అవుతున్నాయి.

ఈ ఒత్తిడి పిల్లలనుండి పెద్దలవరకు సర్వ సాధారణమైపోయింది. కానీ, అదృష్టం ఏమిటంటే ఈ ఒత్తిడులను తగ్గించ‌డం మ‌న వ‌ల్లే సాధ్యం చేసుకోవ‌చ్చు. ఒత్తిడిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచీ సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.


అలాగే కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో 45 సెకన్లు నొక్కిపడితే అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. దీని ద్వారా కొత్త ఎనర్జీ వచ్చి, రిలాక్స్ అవుతారు. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల కూడా తలనొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశాలుంటాయి. వ్యాయామాలు మెదడుకు చాలా ఆరోగ్యకరం మరియు ఒత్తిడిని అధిగమించుటలో సమర్థవంతంగా పని చేస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: