మునక్కాయ అంటే చాలామంది ఇష్టపడతారు. వేసవిలో ఇవి బాగా కాస్తాయి. మునగాకుతో బోలెడు వంటకాలు చేస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మునక్కాయ, మునగ ఆకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అతి ముఖ్యంగా మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.


మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు.
మునక్కాయల్లో విటమిన్ సి- ఎక్కువగా ఉటుంది. ఈ పచ్చిని ముగకాయ, మునగాకులో అధికశాతంలో ఐరన్, విటమిన్స్, మరియు క్యాల్షియం పుష్కలంగా ఉండి, ఎముకలు ఆరోగ్యానికి, బలానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు రక్తాన్ని శుద్ది చేయడానికి బాగా సహాయపడుతుంది.  మునక్కాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకవు. ముఖ్యంగా గొంతు, చర్మం, ఛాతీ ఇన్ఫెక్షన్లు దరిచేరవు. చర్మానికి సంబంధించిన ఫంగల్ సమస్యలపై కూడా బాగా పనిచేస్తాయి.


అలాగు జీర్ణసమస్యలతో బాధపడేవారికి మునగ ఆకు చాలా మంచిది. ఇక చాలా మంది అభిప్రాయం ప్రకారం ములకాయి తినడం వల్ల సంసారం లో మీరు సంతృప్తి చెందుతారు అని ఒక అభిప్రాయం ఉండేది. వాస్త‌వానికి ములక్కాయ తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరగడం, కొన్ని రకాల శారీరక బద్ధమైన హార్మోన్లు ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల వాళ్ళు వల్ల జీవితం లో సంతోషంగా గడపగలరు. తరచూ మునక్కాయలు, మునగ ఆకులు తినడం వల్ల అల్సర్, పెద్దపేగు ట్యూమర్లు రాకుండా నిరోధిస్తుంది. కాన్సర్ వచ్చే అవకాశాలను అడ్డుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: