వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్,డెంగ్యూ వస్తుందన్న భయం అందరిలో మొదలవుతుంది. ఈసారి తెలంగాణలో డెంగ్యూ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న విషయం అందరికీ తెలిసినదే. దీనిపై అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వ యంత్రాంగం డెంగ్యూ నీ అరికట్టి ప్రయత్నాలు చేస్తూ ఉందని అని  ప్రభుత్వం ప్రకటించింది. ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు డెంగ్యూ కేసులలో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది.


 డెంగ్యూ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 13,200 కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్‌ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉందని తెలిపింది. 


దేశవ్యాప్తంగా ఈ ఏడాది 78 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. అందులో 58 మంది మరణించారన్నారు. తెలంగాణలో ఇద్దరు  డెంగ్యూ కారణంగా మరణించారని, కర్ణాటకలో 12 మంది, ఉత్తరాఖండ్‌లో 8 మంది  డెంగ్యూతో మరణించారన్నారు. తెలంగాణలో 40 నుంచి 50% వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయన్నారు.


ఈ ఏడాది ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురవడం వల్లే డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయని కేంద్ర బృందం అంగీకరించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 డెంగ్యూవ్యాధి నిర్ధారణ కేంద్రాలుంటే, ఈ ఏడాది 28కి పెరిగాయన్నారు. గతేడాది తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు పెద్దగా లేవని, కానీ ఈ ఏడాది ఏకంగా 350 చోట్ల వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు జరిగాయన్నారు.గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో కీటక జనిత వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్‌ జోషి ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: