తమలపాకు భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. భారతీయ సంస్కృతిలో తమలపాకు వినియోగం ఎక్కువే. పూజలు, శుభకార్యాలలోనే కాకుండా వీటిని రోజూతీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఎక్కువగానే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే.. శ‌రీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి.


అదే విధంగా తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నా.. త‌మ‌ల‌పాకుతో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. తమలపాకును తినడం కొంతవరకూ ఆరోగ్యమే. కానీ ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం బారిన పడడం ఖాయం అని వారు చెబుతున్నారు. తమలపాకును తొడిమతో సహా తీసుకునే మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 


అదే విధంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు తమలపాకుకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ 5 నుంచి 10 ఆకులు తీసుకుంటే డ్రగ్స్‌లాగా అలవాటయ్యే ప్రమాదం ఉందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. తమలపాకును పొగాకుతో కలిపి తీసుకుంటే ప్రాణాంతకమైన నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. సో.. బీకేర్ ఫుల్‌..!


మరింత సమాచారం తెలుసుకోండి: