వయసుతో ఏ మాత్రం పనిలేకుండా చిన్న నుంచి పెద్దవారిలో కూడా ఒకే సమస్య తరచూ తలెత్తుతూ ఉంటుంది. అదేంటంటే.. అంగస్తంభన.. ఈ సమస్య తలెత్తడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు . ముఖ్యంగా నరాల బలహీనత, మర్మాంగాలకు తగిన రక్త సరఫరా లేకపోవడం, మధుమేహం, రక్తపోటు, ఆత్రుత, ఒత్తిడి, కుంగుబాటుతనం, ఔషదాల సైడ్‌ ఎఫెక్ట్స్, మద్యపానం, స్మోకింగ్ వంటి సమస్యల వల్ల అంగస్తంభన వంటి రుగ్మతలు రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయంటున్నారు. 

ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది వయాగ్రాను వాడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. అలాంటి రసాయనిక పదార్థాలను వాడకుండా సహజ సిద్దమైన వాటితో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవచ్ఛునో ఇప్పుడు చూద్దాం.. సహజంగా దొరికేవాటి వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ మరియు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉండవట. ముఖ్యంగా ఈ  పదార్థాలను తినడం వల్ల ఈ సమస్యలను పూర్తిగా దూరం చేసుకోవచ్చునట..
పుచ్చకాయ: 

ఈ పుచ్చకాయలు నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయట..  సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం మూడ్‌ను ఉత్తేజితం చేస్తుంది. సెక్స్‌కు ప్రేరేపిస్తుంది. అందుకే వయాగ్రా అవసరం లేదని అంటున్నారు. 

బ్లాక్ చాక్లెట్:
చాకొలేట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. అలాంటి చాకొలేట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల చిన్న పిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా ఈ ఛోకోలెట్స్ తినడం అలవర్చుకోండి.. ఇది హృదయనాళ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి.

బననా :
ఈ బననా వల్ల  కొంతమంది లావు అవుతారని చాలా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు బననా వల్ల అంగస్తంభన సమస్యలు పూర్తిగా దూరమవుతాయట. సెక్స్ హార్మోన్లను పెంచే బ్రొమలెన్‌తో పాటు విటమిన్-బి ఉంటాయి.

దానిమ్మ జ్యూస్ :
దానిమ్మ జ్యూస్ లో చాలా పోషకాలు ఉండటం వల్ల ఈ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని ఖనిజాలను అందిస్తుంది. అందుకే ఈ పండ్లను చాలా మంది తింటుంటారు.యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తాయి. అంగస్తంభనకు ఇది చక్కని ఔషదమని చాలా పరిశోధనల్లో తేలింది. 


అవకాడో, అగరబత్తుల పొగ, గుల్లలు, వెల్లుల్లి, మిర్చి, అల్లం వంటి వాటిని వాడటం వల్ల ఈ అంగస్తంభన సమస్యలు దూరమవుతాయని అంటున్నారు. అందుకే మీరు ట్రై చేయండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: