డెంగీ విషజ్వరం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఒక కుటుంబంలో  తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబం కు చెందిన నాలుగు   తరాల వారు డెంగీ విషజ్వరం సోకి మృతి చెందారు .  కేవలం  15  రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు  డెంగీ విషజ్వరం  బారిన పడి మృతి చెందడం ... వారి బంధువుల్ని కలిచి వేస్తోంది . ఈ నెల 16 న మంచిర్యాలకు చెందిన రాజగట్టు డెంగీ విషజ్వరం సోకి మృతి చెందాడు . ఆ తరువాత ఈ నెల 27 న అతని కూతురు కు  కూడా డెంగీ సోకి మరణించింది .


తాజాగా అతని భార్య సోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో డెంగీ విషజ్వరానికి చికిత్స పొందుతూ మృతి చెందింది . సోనీ డెంగీ తో పోరాడుతూనే, మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది . బుధవారం సోనీ మృతి చెందడం తో ఆ కుటుంబం లో  పూర్తిగా విషాదఛాయలు అలుముకునున్నాయి . రాజగట్టు తాత కూడా గతం లో డెంగీ విష జ్వరం సోకి మృతి చెందడంతో , ఆ కుటుంబం నాలుగు తరాల వారిని డెంగీ జ్వరం బలిగొంది . మంచిర్యాల జిల్లాలో డెంగీ విషజ్వరాలు ప్రబలుతుండడం తో స్థానికులు తీవ్ర కలవరం చెందుతున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ విష జ్వరాలు  విజృభిస్తుండడం , ఇప్పటికే పలువురు మృత్యువాత పడడం తో రాష్ట్ర హైకోర్టు కూడా ప్రభుత్వం పై సీరియస్ అయింది.


డెంగీ  నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది . ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా ? అంటూ అసహనం వ్యక్తం చేసింది . అయితే రాష్ట్ర మంత్రులు మాత్రం విషజ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కాదని చెబుతూ ... కాలం వెళ్లబుచ్చుతున్నారు . విషజ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వం మాత్రం నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో వెల్లడించకపోవడం విస్మయం కలిగిస్తోంది .     

మరింత సమాచారం తెలుసుకోండి: