చాలామంది తాము చాలా సన్నగా ఉన్నామని ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతుంటారు. వాస్త‌వానికి ప్రపంచంలో ఎక్కువ మంది లావుగా ఉండి, అదనం గా ఉన్న బరువును ఎలా తగ్గించు కోవాలో అర్ధం కాక తలలు బాదుకుంటుంటే అందుకు భిన్నంగా మేము లావు కాలేక పోతున్నాము అని బావురు మనే వారికి కూడా కొదవ లేదు. వారు ఎన్ని చిట్కాలు పాటించినా లావుకారు. అయితే బరువు పెరగడానికి ఏది పడితే అది తినేస్తే.. రిస్క్ లో పడతారు.
 
అయితే బరువు పెరగడం అంత తేలికైన విషయం కాదు. ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోకపోతే.. చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమౌతాయి. లావు పెరగాలాంటే ఎక్కువ శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ మూడు పూటలా ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన వెంటనే తప్పకుండా ఏదైనా ఒక ఫ్రూట్‌ను తీసుకోవాలి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్యలో స్నాక్స్‌ తీసుకోవాలి. 


దీనివల్ల అదనపు క్యాలరీలు లభిస్తాయి. బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలు పాలు. పాల నుండి ప్రోటీన్, కాల్షియంలను పొందవచ్చు. చీస్, పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి. అలాగే లావు కావాలనుకునే వారికి రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్రపోతేనే లావు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: