షుగర్ వ్యాధిగ్రస్తులకు శీతాకాలం ఒక నరకంలా ఉంటుంది. వారి షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతుంటాయి. అలా షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ లో ఉంచడానికి మేం ఈ ఆర్టికల్ లో చెప్పే పండ్లను తరచుగా తినండి. 


సిట్రస్ జాతికి చెందిన కమలాలు, బత్తాయిలో ఉండే రకరకాల ప్రోటీన్స్, విటమిన్ సి వలన మధుమేహ వ్యాధిగ్రస్తులోని షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతాయి. కొన్ని పరిశోధనలలో కమలాలు తినడం వలన రక్తంలోని చెక్కర స్థాయి తగినట్లు రుజువైంది. అందుకే, మీరు క్రమం తప్పకుండా బత్తాయిలను ఏ భయం లేకుండా స్వీకరించండి. 


జామకాయ: జామకాయలో ఎక్కువగా ఉండే ఏ మరియు సి విటమిన్లు చెక్కర స్థాయిని సులువుగా తాగిస్తాయి. ఈ పండులో ఉండే ఫైబర్ రక్తంలోని కొవ్వుని గ్లూకోస్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. అందరికి ఈజీ గా లభించే జామకాయ తినడం వలన మంచి ఆరోగ్యం లభించును. 


ఆపిల్స్ : మన అందరికీ నచ్చిన పండు ఆపిల్. ఈ పండ్లు రుచిలోనే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఇక మధుమేహ గ్రస్తులు ఏ సమయంలోనేనా తినగలిగిన పండు ఆపిల్. ఈ పండ్లు మలబద్దకాన్ని కూడా తగ్గించగలవు. టైపు 2 డయాబెటిస్ ని నిరోధించగల శక్తి కూడా ఈ ఆపిల్స్ కి ఉంది. 
కివి : కివి పండ్లు కొంచెం ధర ఎక్కువయినప్పటికీ, దీనిలో ఉండే యాంటీఆక్సిడాంట్స్, విటమిన్ సి షుగర్ వ్యాధిగ్రస్థులకు చాలా అంటే చాలా మేలు చేస్తాయి. 


ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చే వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ఈ భయంకరమైన జబ్బు ఒకసారి వచ్చిందంటే నయం చేయడం సాధ్యం కాదు. ఆహార అలవాట్ల తో పాటు, రోజు వ్యాయామం చేయడం ద్వారా, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం లాంటివి చేస్తే మీరు డయాబెటిస్ ని అరికట్టవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: