ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువమంది ఇయర్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. కానీ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వినియోగిస్తే మాత్రం వినికిడి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు రోజులో 4 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వాడితే ప్రమాదం అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇయర్ ఫోన్స్ ఎక్కువ సమయం వినియోగిస్తే వినికిడి సమస్యలు ఎదురవుతాయని చెప్పింది. 
 
మానవుల చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ కణాలు పెద్ద పెద్ద శబ్దాలను ఎక్కువ సమయం తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. యువతలో చాలామంది పాటలు వినేందుకు, వీడియోలు చూసేందుకు ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వినియోగించే వారికి చెవుడు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైద్యులు భారీ శబ్దాల వలన వినికిడి సమస్యలు ఎదురైతే చికిత్స లేదని చెబుతున్నారు. 
 
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశంలో వినికిడి సమస్యలతో బాధ పడేవారు చాలా ఎక్కువమంది ఉన్నారని వయసు పెరగటం వలన వచ్చే సమస్యలతో బాధ పడే వారికంటే వినికిడి సమస్యలతో బాధ పడే వారి సంఖ్య ఎక్కువని చెబుతోంది. ఇయర్ ఫోన్స్ రోజులో ఎంత తక్కువ సమయం వాడితే అంత మంచిదని ఇయర్ ఫోన్స్ తక్కువగా వాడే వారికి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు. 
 
ఒకరు వాడిన ఇయర్ ఫోన్స్ మరొకరు వాడితే ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక పరిశోధనలో ఇతరుల ఇయర్ ఫొన్స్ వాడే వారి చెవుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తే గుర్తింపు పొందిన బ్రాండ్ ల ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది. ఒక అధ్యయనంలో ఇయర్ ఫోన్స్ వాడే వారిలో ఒంటరితనం పెరిగిపోతుందని ప్రశాంతత దూరమవుతుందని తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: