ప్ర‌స్తుత స‌మాజంలో చాలా ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాల్లో ఇనుము ఒకటి. ఇది లోపిస్తే అలసట, ఆయాసం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఇలా తరచుగా వస్తుంటే రక్తహీతన ఉన్నట్లు లెక్క. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార‌ అల‌వాట్లు కూడా మార్చుకోవాలి. అయితే ఖ‌ర్జూరంతో ర‌క్త హీన‌త‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఎందుకంటే శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఖర్జూరం ముందు వరసలో ఉంటుంది. 


ఇందులో అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయి. ఖర్జూరాన్ని 'ప్రోటీన్స్‌ పవర్‌ హౌస్‌' అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇందులో విటమిన్‌ ఎ,బి లతో పాటు కాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. ప్ర‌తి రోజు ఖ‌ర్జూరం తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. ఉదయాన్నే ఖర్జూరాలు తినడం వల్ల ఆకలితో బాధపడకుండా రోజంతా సంతృప్తతను కలిగిస్తుంది. ఖర్జూరాలు క్రమం తప్పకుండా తింటే హృదయనాళ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


అదే విధంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ రూపంలో ఉండే విటమిన్‌ 'సి' కంటికి చాలా మంచిది. దీనిని రోజు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది.  నిద్ర‌లేమితో బాధ‌ప‌డే వారు ఖ‌ర్జూరం తింటే చాలా మంచిది. అలాగే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: