లవంగము అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగా ఇది అన్నిరకాల వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటారు. వీటి వ‌ల్ల వంట‌ల‌కు మంచి వాస‌న మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని రుచి కూడా వ‌స్తుంది. ఎక్కువ‌గా నాన్ వెజ్ వంటల్లో ల‌వంగాల‌ను వాడుతారు. అయితే ల‌వంగాల‌తో చేసే టీ వ‌ల్ల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. లవంగ టీలోని విటమిన్ ఇ, కెల వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. 


దంతాల్లో నొప్పి, వాపు వంటి సమస్యలకు లవంగ  టీ తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. నోటి దుర్వాస‌న త‌గ్గిస్తుంది.  ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం కావాలంటే లవంగం టీని తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.లవంగాల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అందువల్లే లవంగాలు టీ చర్మ సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.


ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. వయసుతో పాటు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా అజీర్తి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారు భోజనం చేయడానికి ముందు లవంగం టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, మచ్చలు, కురుపులు ఉన్నచోట లవంగం టీతో మర్దన చేస్తే అవి నెమ్మదిగా తొలగిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: