శరీరంలో ఎముకలు కీలకమైన నిర్మాణాలు. ఇవి శరీరాన్ని నిటారుగా నిలబెట్టి, ఒక ఆకృతిని అందించడమే కాదు. అంతర్గత అవయవాలకూ రక్షాకవచంగా నిలుస్తాయి. అయితే మన శరీరంలో ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి క్యాల్షియం బాగా అవసరం అవుతుందని అందరికీ తెలిసిందే. క్యాల్షియం ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మహిళలకు మగవారితో పోలిస్తే ఎక్కు వ ‘కాల్షియం’ అవసరం. ఆడపిల్లలకు కాల్షియం ఎక్కువగా ఉంటేనే ప్రసవ సమయంలోనూ, ఇంటి పని, ఆఫీసు పని చక్కబెట్టుకునే శక్తిసామర్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 


శరీరంలో క్యాల్షియంను నిల్వచేసుకునే ప్రధానమైన నిర్మాణాలూ ఎముకలే. శరీరం దృఢంగా ఉండాలంటే వీలైనంత వరకూ ఎముకలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే తరచు కాలిఫ్లవర్, క్యాబేజీ., పాలు, పెరుగు, పన్నీర్ వంటివి తీసుకోవాలి. అదే విధంగా టొమాటోల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయి. సీతాఫలం, సపోటా లాంటి పండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తినాలి. 


ఒక కప్పు వేడిపాలల్లో టీస్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగి తే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. గ్రీన్‌ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలలో పిండి పదార్థాలు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తాయి. ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: