శరీరానికి మాంసకృత్తులు చాలా అవసరం. ఇవి మాంసాహారం తినడం వల్ల శరీరంలో చేరి బలాన్ని చేకూరుస్తాయి. మాంసాహారం తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు అందుతాయన్న విషయం తెలిసిందే. కానీ అతి ఎక్కడయినా మంచిది కాదన్న విషయం ఇక్కడ కూడా వర్తిస్తుంది. మాంసం తినడం వల్ల కండరాలు పెరిగి బలంగా తయారవ్వడం కరెక్టే అయినా, అధికంగా మాంసం తీసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయని అంటున్నారు.


ఇలా అతిగా మాంస తినడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాంసహారం తొందరగా జీర్ణం అవదు. అందువల్ల అతిగా తినడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. గ్సాస్, అసిడిటీ ఏర్పడి జీర్ణాశయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా మాంసం అతిగా తినడం వల్ల శరీరం కీటోసిస్ అనే స్థితికి చేరుకుంటుందట. దీనివల్ల నోటి నుండి దుర్వాసన వెలువడుతుందట.


ఇంకా శరీరంలో మాంసహారం చేసే హాని చాలానే ఉందని అంటున్నారు. అవసరానికి మించి తీసుకోవడం వల్ల మాంసహారంలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ వల్ల మగత కలుగుతుందట. దీనివల్ల ఎక్కువ నిద్ర వస్తుందట. అలాగే ఏ పని చేయాలనిపించక బద్దకంగా తయారవుతారని అంటున్నారు. ఎల్లప్పుడూ మత్తుగా ఉండి విషయాలపైన దృష్టి నిలవకుండా చేస్తుందట.


అతిగా మాంసాహారం తినేవారికి వికారం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరి అంతలా తిని బాధపడే కంటే  తక్కువ తిని హాయిగా ఉండటమే మేలని సూచిస్తున్నారు. అయితే శరీరానికి అవసరమయినంత మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ఏదైనా అతిగా తీసుకుంటే చెడు చేస్తుందని చెప్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: