చాపకింద నీరులా చాలా గోప్యంగా శరీరంలోకి చేరిపోయే ఆరోగ్యశత్రువు మధుమేహం. ఏమాత్రం అప్రమత్తత లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదుని మాత్రమే మిగులుస్తుంది.   మారుతున్న ఆహారపు అలవాట్లు కావొచ్చు... పెరుగుతున్న మానసిక ఒత్తిడి కావొచ్చు... ఏదైనాకానీ సాటి మనిషికి పట్టుకున్న భయం మధుమేహం. ఎక్కడ ఏ పదిమంది పలకరించుకున్నా చర్చంతా దీనిపైనే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారత్‌లో 6.2 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ నియంత్రించాలంటే అందుకు సరైన డయాబెటిక్ డైట్ ను ఫాలో అవ్వాలి.


అయితే ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ఆకుకూరల ద్వారా లభించే కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్ సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు అవసరం. అలాగే షుగర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. దీని కోసం పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకు, కొత్తిమీర, బచ్చలికూర, పుదీనాలాంటివి తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి.


ఆ ఆకు కూరల్లో ఉండే ప్రొటీన్లు, పొటాషియం, కాల్షియం, ఇతర ఆవశ్యక విటమిన్లు, ఖనిజాలు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండటానికి దోహదం చేస్తాయి.అలాగే ఈ ఆకుకూర‌ల్లో పీచుపదార్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువుకు, గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులొ సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువు తగ్గించుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను, డయాబెటిస్ పర్యావసనాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: