సాధారణంగా శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేకూరి ఆరోగ్యంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. రోజూ తీసుకోవాల్సిన రకరకాల పదార్థాల మీద అందరూ దృష్టి పెడతారు. కానీ పోషకాల గురించే ఆలోచించరు. నిత్యం కొన్నిరకాల పోషకాలు శరీరానికి అందితేనే ఆరోగ్యం ఆనందం రెండూ సొంతమవుతాయి. ఇందులో విట‌మిన్ సి కూడా ఒక‌టి.


విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది. అయితే విటమిన్ సి స్థాయిలు తక్కువగా గలవారికి మెదడులో రక్తనాళాలు చిట్లిపోయే ముప్పు ఎక్కువట‌. అదే విధంగా శరీరంలో విటమిన్ సి లోపించడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత విటమిన్ సి ని అందిస్తే.. సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది.


విటమిన్ సి అనేది శరీరంలోని కణాలను నష్టపరిచే స్వేచ్ఛా రాశులుగా నాశనం చేసే యాంటీఆక్సిడెంట్. ఈ విటమిన్ లేకపోవడం క్యాన్సర్కు దారితీస్తుంది. అదే విధంగా విటమిన్ సి లోపం వ‌ల్ల‌ ఉబ్బసంకి దారి తీయవచ్చు. అయితే వీటిని అదిగమించాలంటే.. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయాలు ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: