సాధార‌ణంగా న‌ల్ల‌ద్రాక్ష తెలియ‌ని వారుండ‌రు. ఎందుకంటే త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే ఈ న‌ల్లద్రాక్ష ఆరోగ్యానికి.. అందానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి.


నల్లద్రాక్ష రక్తంలోని చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వారంలో నాలుగైదుసార్లు వీటిని తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు నల్లద్రాక్షను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదంటున్నారు ఆహారనిపుణులు. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.


నల్లద్రాక్ష ఆరోగ్యానికి అన్నివిధాలా సహకరిస్తుంది. చాలామంది అసిడిటీతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజు తాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో బాధపడుతున్న వారు ద్రాక్ష రసాన్ని కానీ ద్రాక్ష పండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టవచ్చు. అదే విధంగా అధిక రక్తపోటును నియంత్రించాలంటే రోజూ గుప్పెడు నల్లద్రాక్షను తినాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: