సాధార‌ణంగా గుడ్డులోని ప‌చ్చ‌సొన తిన‌డం వ‌ల్ల ప్ర‌మాద‌మా? పచ్చసొన తినడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా? అసలు పచ్చసొన తినాలా? వద్దా?అన్న ప్ర‌శ్నలు చాలా మందిలో ఉన్నాయి. వాస్త‌వానికి రోజంతటికీ కావాల్సిన పోషకాలన్నింటినీ.. గుడ్డు ద్వారా పొందవచ్చు. ఇక రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్డు పచ్చసొన ఎంతో ఉపయోగపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. చెడు కొవ్వు శరీరంలో చేరడానికి ఆహారపు అలవాట్లే కారణం.


గుడ్డులోని పచ్చసొనను తొలగిస్తే అమైనో ఆమ్లాలను కోల్పోతాం. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రొటీన్లుంటాయి.  పచ్చసొనను తొలగిస్తే కేవలం మూడు గ్రాములే మిగిలి ఉంటాయి. గుడ్డులో అనేక పోషకాలుంటాయి. పచ్చసొన తొలగించడం వల్ల ముఖ్యపోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌లతోపాటు విటమిన్లు ‘ ఎ బి ఇ డి కె’ లను కూడా కోల్పోతాము.


అందుకే ఒక వ్యక్తి సేఫ్‌గా రెండు గుడ్లు పచ్చసొనతో పాటు నిరభ్యంతరంగా తినొచ్చు. పచ్చసొనలో ఫ్యాట్‌ కాంపౌండ్స్‌తో పాటు కొన్ని ముఖ్యమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా ఫ్యాట్‌ సొల్యూబుల్‌ విటమిన్స్‌ ఎ,డి,ఈతో పాటు హార్మోన్లను ప్రభావితం చేసే కాంపౌండ్స్‌ కూడా ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఒక గుడ్డు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తీసుకుంటే సమతులం అవుతుంది. అదే విధంగా రాత్రి భోజనంతో పాటు ఒక గుడ్డు తింటే శరీరంలో అన్ని వ్యవస్థలు సవ్యంగా సాగుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: