గర్భం దాల్చడం, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మను ఇవ్వడం అనేది మహిళలకు దక్కే అదృష్టంగా చెబుతారు. మాతృత్వంలో అంత గొప్పదనం ఉంటుందని స్త్రీకి తల్లి అయిన తర్వాతే తెలుస్తుంది. అయితే డెలివరీ అయిన వెంటనే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. డెలివరీ తర్వాత శరీరంలో, హార్మోన్స్ లో చాలా మార్పులు కనిపిస్తాయి. అందుకే డెలివ‌రీతర్వాత తల్లి పోషకాహారం తీసుకోవడం చాలా అవ‌స‌రం. ప్రసవానంతరం తల్లి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తగినన్ని న్యూట్రీషియన్స్‌ ఉండేటట్లుగా ఖ‌చ్చితంగా చూసుకోవాలి.


యితే గర్భం సమయంలో శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మహిళ ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో,  ప్రసవం తర్వాత బాలింత సమయంలో కూడా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. డెల‌వ‌రీ ముందు.. ఆ త‌ర్వాత కూడా కాఫీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే  కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ తీసుకోవడం వలన తల్లి, బిడ్డకు నిద్రేలేమిని కలిగిస్తాయి. వేరు శనగను బాలింతలు తీసుకోకూడదు. ఎందుకంటే బిడ్డకు అలర్జీని కలిగిస్తుంది.


బాలింతలు మద్యం సేవించకూడదు. ఇది మీ శరీరానికి హాని కలిగించటమే కాకుండా శిశువుకు మీరు ఇచ్చే పాలలో చేరి వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. పాలిచ్చే తల్లులు చాక్లెట్స్ తీసుకోవడం వలన వీటిలో ఉండే కెఫీన్ మరియు సోడా తల్లి, బిడ్డ శరీరంలో  చేరి మంచి నిద్రను దూరం చేస్తాయి. అదే విధంగా మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, కొన్ని రకాల చేపలు, పెప్పర్ పదార్థాలు,  బ్రోకలీ, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: