అంటువ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది డెంగ్యూ. గత 5-6 సంవత్సరాల నుండి భారతదేశంలో డెంగ్యూ పెరుగుతోంది. పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే వారు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటమే కాక, దోమలు పగటిపూట కుట్టడం వల్ల‌ డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. సీజన్‌ దాటినా ఇప్పటికీ డెంగీ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఎడిస్ ఈజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. ఈ దోమ కుట్టిన ఐదు నుంచి ఎనిమిది రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. 


ఇక ఈ మ‌ధ్య కాలంలో డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంద‌రో. అయితే  ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగే మొక్కలైన నిమ్మగడ్డి మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే చాలు.. దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకట్రెండు మొక్కలను పెంచితే చాలు.. దోమలు పరారవుతాయి. నిమ్మగడ్డిలో చాలా రకాలుంటాయి. వాటన్నింటిలోకి సైబోపోగాన్‌, నార్డస్‌, సెట్రోనెల్లా వింటేరియానస్‌ అనే మొక్కల రకాలే దోమలను సమర్థవంతంగా అరికడతాయి. 


అలాగే వీటితో పాటు ప‌లు జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి. చుట్టుపక్కలా నీటి గుంటలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి. మురియు ఇంటి ప‌రిశుభ్ర‌త చాలా ముఖ్యం. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో వడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు. డెంగ్యూను నివారించడానికి ఎలాంటి టీకాలు లేవు. కాబట్టి దోమ కాటుకు గురి కాకుండా ఉండటమే మార్గం.


మరింత సమాచారం తెలుసుకోండి: