శీతాకాలం వచ్చిందంటే చిక్కుడుకాయ(బీన్స్‌) కంటికి ఇంపుగా నోరూరిస్తూ కనిపిస్తుంటుంది. చిక్కుడులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మన శరీరానికి పోషకాలను అందించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనిలో ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌ ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది. వారంలో మూడు సార్లు బీన్స్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణలు చెబుతున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.


బీన్స్ తిన‌డం వ‌ల్ల‌ రక్తంలోని షుగర్ లెవెల్స్ ని స్థిరపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రోటీన్లు లభ్యమౌతాయి. అంటే ముఫై గ్రాముల చికెన్, మటన్‌లలో లభించే పోషకాలతో సమానం. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పని చేస్తాయి.

చిక్కుడు కాయల్లోని విటమిన్‌ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్‌ కోలీన్‌ అనే న్యూరో ట్రాన్స్‌ మీటర్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  శరీరంలోని కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఫలితంగా చిక్కుడు కాయలు వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని తేలింది. సెలీనియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలు చిక్కుడులో పుష్కలంగా ఉన్నాయి. అలాగే  దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషధంలా పని చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: