పాలను ఆరోగ్యాన్ని సంరక్షించే సహజ ద్రావణంగా పేర్కొనవచ్చు. పాలలో అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు మరియు ఆరోగ్యానికి పాలు చాలా అవసరం. పిల్లలకు ఆవుపాలు ఎంతో శ్రేష్ఠమయినవి. పాలను బాగా కాచి పొంగిన తరువాత పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాలు బలహీనంగా ఉన్నవాళ్లకు లావెక్కటానికి తోడ్పడతాయి. తక్కువ బరువు ఉన్నవారు పాలు తాగటం వలన శరీరం బరువు ఉండాల్సిన స్థితికి వస్తుంది. 
 
పాలు తాగటం వలన శరీరంలో రక్తప్రసరణ సహజసిద్ధంగా మెరుగుపడుతుంది. ఎసిడిటీతో బాధ పడే వాళ్లకు పాలు మంచి ఆహారం. నిద్రలేమి సమస్యలతో బాధ పడేవారు పడుకోబోయే ముందు పాలలో తేనెను కలుపుకొని తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. బ్రాంకైటిస్, టాన్సిలైటిస్, ఉబ్బసం, గొంతు బొంగురుపోవటం, జలుబులాంటి వ్యాధులకు పాలు ఔషధంలా పనిచేస్తాయి. 
 
శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధ పడేవారు కాచిన పాలలో కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి కలుపుకుని తాగితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు దూరమవుతాయి. పాలు ప్రతిరోజు తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి. పాలు విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు కలిగి ఉంటాయి. పాలు ఎక్కువగా తాగే వాళ్లలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాలు సౌందర్య సాధానాలుగా కూడా ఉపయోగపడుతాయి. కాచిన పాలలో నిమ్మకాయ రసాన్ని పిండి కొంత సమయం తరువాత మెడ, చేతులు, ముఖానికి రాసుకొని ఆరబెట్టాలి. ఇలా చేస్తే శరీరానికి మృదుత్వం, మెరుపు వస్తాయి. పాలలో పచ్చిగుడ్డుసొనను కలుపుకుని ఆ మిశ్రమంతో తలంటుకుంటే జుట్టు ఒత్తుగా పెరగుతుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: