చలికాలంలో లభించే వాటిలో రేగిపండ్లు ఒకటి. పోషకాలు అధికం. రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటాయి. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో రేగిపండ్లు ఎక్కువగా మనకు లభిస్తాయి. అందువల్ల వీటిని ఈ సీజన్‌లో తింటే మనకు అనేక లాభాలు కలుగుతాయి.  రేగిపండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి, కంటి చూపు పెరుగుతాయి.


ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కానీ ఈ సమస్య తగ్గదు. పూర్వం ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేని కాలంలో ఆ లోటును పూడ్చేందుకు రేగిపళ్లను తినమనేవారు. రేగిలోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. రేగిపండ్లలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.


రేగిపళ్ల జ్యూస్ తాగడం వల్ల గుండెపోటు, హృద్యోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు. అనీమియాతో బాధపడేవారు ఈ జ్యూస్‌ను తాగడం మంచిది. ఒక గ్లాసు జ్యూస్ తాగడం వల్ల చర్మానికి రక్షణగాఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిపోతుంది.రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రేగిపండ్లను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. ఈ పండ్లలో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికళ్లను బయటకు పంపేస్తాయి. రేగిపండు తొక్కు కాలేయానికి చాలామంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: