తాజాగా కొందరు పరిశోధకులు చేసిన పరిశోధనల్లో రోజూ వైన్ తాగితే ఎన్నో రోగాల బారి నుండి మన శరీరాన్ని వైన్ రక్షిస్తుందని తేలింది. సాధారణంగా వైద్యులు రోజూ వైన్ తాగితే లివర్ చెడిపోతుందని చెబుతారు కానీ ఈ పరిశోధనల్లో మాత్రం రోజూ వైన్ తాగేవారికి వృద్ధ్యాప్య ఛాయలు కూడా త్వరగా రావని తేలింది. వైన్ తాగితే మంచిదని ఏ వైన్ పడితే ఆ వైన్ తాగితే శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. 
 
ఓట్స్, బ్లాక్ బెర్రీ వంటి వాటితో తయారు చేసిన వైన్స్ మాత్రమే శరీరానికి మంచివి. పరిశోధకుల పరిశోధనల్లో బీర్లు, మద్యం తాగే వాళ్లతో పోలిస్తే వైన్ తాగేవారు 34 శాతం తక్కువగా మరణిస్తారని తేలింది. తగిన మోతాదులో వైన్ తీసుకుంటే ఆయుష్షు పెరగటంతో పాటు వైన్ యవ్వనంగా ఉంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వైన్ అందుబాటులో లేనివారు క్రాన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, ద్రాక్ష తిన్నా వృద్ధ్యాప్యఛాయలు దరి చేరవు. 
 
రెడ్ వైన్ గుండె సంబంధిత వ్యాధులు కలగకుండా కాపాడటంతో పాటు అందులో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య లక్షణాలను దరికి రానివ్వదు. వైన్ మధుమేహంతో పాటు హై బీపీని కంట్రోల్ చేయటంతో పాటు వైన్ లో ఉండే ప్లేవానాయిడ్స్ చర్మకణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. రెడ్ వైన్ తాగేవారికి గుండె సంబంధిత సమస్యలు తక్కువగా రావటంతో పాటు మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. 
 
రెడ్ వైన్ లో ఉండే ఆమ్ల జనకాలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. క్రీస్తు పూర్వంలో ఈజిప్టియన్లు వైన్ ను ఔషధంగా ఉపయోగించేవారు. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరంలో వైన్ ను ఎక్కువగా తాగేవారని పరిశోధకులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: