ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటూ, సమస్త జీవానికి ఆధారమైన భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు అంటున్నారు పరిశోధకులు.మనిషి శరీరంతో పాటు పర్యావరణానికి మేలు చేసే 50 రకాల ఆహారాల జాబితాను 'సూపర్ ఫుడ్స్' పేరుతో వారు ఆవిష్కరించారు.ఆహార తయారీ సంస్థ నార్, వరల్డ్ వైల్డ్ లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)- యూకే సంస్థ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.ఈ 'సూపర్ ఫుడ్స్‌' జాబితాలో రకరకాల ఆకులు, దుంపలు, వేళ్లకు శాస్త్రవేత్తలు చోటిచ్చారు.


అయితే, ఇందులో భారతీయులకు చిరకాల పరిచయమున్న ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి.వాటిలో కొన్ని..మునక్కాయలే కాదు మునగ ఆకుల్లోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగకు ఎంతో ప్రాధాన్యం ఉంది.మునగ ఆకుల్లో ఏ, బీ, సీ విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి.పంటకూ పంటకూ మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా అనపకాయ వేస్తుంటారు. ఎలాంటి నేలలోనైనా, వాతవరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది. లేతగా ఉన్నప్పుడు లోపలుండే గింజలనే కాకుండా మొత్తం కాయనూ తినొచ్చు. ప్రొటీన్, పీచు పదార్థం పాళ్లు సమృద్ధిగా ఉంటాయి.


మాంసంతో పోలిస్తే మైసూర్ పప్పును ఉత్పత్తి చేయడంలో వెలువడే కర్బన ఉద్గారాలు 43 రెట్లు తక్కువ. ప్రోటీన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. వండటం తేలికే. 15 నుంచి 20 నిమిషాల్లో ఉడికిపోతుంది.ప్రతి వంద గ్రాముల సోయా చిక్కుడులో దాదాపు 38 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. గుడ్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. విటమిన్ 'కే', 'బీ' లతోపాటు ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం, కాల్షియం వంటి పోషకాలన్నీ ఉంటాయి.


బీట్‌రూట్ ఆకుల్లో మెగ్నీషియం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. దాదాపు సగం మంది ప్రజలు రోజూ అసవరమైనంత మెగ్నీషియం తీసుకోరని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఐరన్‌తో పాటు కంటిచూపునకు మంచిదైన లూటెన్ కూడా వీటిలో ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: