సాధార‌ణంగా చాలా మంది చికెన్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. చికెన్ టేస్ట్ లో ఉన్న గొప్పదనం మనల్ని కొన్ని విషయాలు ఆలోచించనీయకుండా చేస్తుంది. కొంద‌రు ఉడుకుతూ ఉండంగానే తింటుంటారు. సరిగా ఉడికీ ఉడకని చికెన్‌ తింటే అందులోని క్యాపిలోబ్యాక్టర్‌ జెజునీ అనే బ్యాక్టీరియా వల్ల పక్షవాతం వచ్చే ముప్పు ఉందని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఉడికీ ఉడకని చికెన్ గ్యూలియన్ బర్రీ సిండ్రోమ్‌కు దారితీస్తుందన్నారు. జిబిఎస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇది మానవుల్లో న్యూరోమస్కలర్ పెరాలసిస్ రావడానికి కారణమౌతుందంటున్నారు.


ప్ర‌స్తుత కాలంలో ఈ భ‌య‌క‌ర‌మైన వ్యాధి అంద‌రిని భ‌య‌పెడుతోంది. అలాగే ఈ పక్షవాతం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం ఉండదు. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అవి పనిచేయకుండా పోతాయి. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు వాంతులు, అతిసారంతో బాధపడుతుంటారు. కాళ్లు చేతులు బలహీనపడి క్రమంగా అది పక్షవాతాని దారితీస్తుందని తేల్చారు.


అయితే స‌రిగ్గా ఉడికించిన చికెన్ తిన‌డం వ‌ల్ల ఎలాంటి న‌ష్టం ఉండ‌దు. అదే విధంగా చికెన్ ను సరైన మోతాదులో ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. డిప్రెషన్, గుండె వ్యాధులు అలాగే కొన్ని ఊపిరి సంబంధమైన వ్యాధుల బారిన పడకుండా చికెన్ రక్షిస్తుంది. రెడ్ మీట్స్ కంటే చికెన్ ఎంతో ఉత్తమం. పెప్పర్ సూప్ లో ఉడికించిన చికెన్ ను తీసుకోవడం వల్ల జలుబుకు తక్షణ ఉపశమనమిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: