ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునేందుకు  టైమ్ మాత్రం ఎవరు కేటాయించటం లేదు  . దీంతో 50 - 60 లలో రావాల్సిన రోగాలన్నీ 30 సంవత్సరాలలోపు వస్తున్నాయి. ప్రస్తుత మనుషుల జీవన శైలి రోగాలకు దారితీస్తుంది. దీంతో వయసులో ఉన్నప్పుడే విటమిన్ లోపంతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఆధునిక జీవనంలో మనుషులు అన్ని  మర్చిపోయారు . వ్యాయామం చేయడం ఒళ్ళు వంచి పని చేయడం లాంటివి పూర్తిగా మారిపోయి ఒకే దగ్గర శిల్పంలా కూర్చొని గంటలపాటు పని చేసే  రోజులు వచ్చాయి. దీంతో ఒక్కటే చోట గంటలపాటు కూర్చోవడంతో రోజురోజుకు రోగాలకు దగ్గరవుతున్నారు ప్రజలు. 

 

 

 

 ఇప్పుడు ప్రజలను ఎక్కువగా బాధిస్తున్న సమస్య  కీళ్ల నొప్పులు. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కీళ్ల నొప్పులు ఉండేవి...  అది కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీనికి కారణం ప్రస్తుత ఆధునిక జీవనశైలే. రాజకీయాలు నొప్పుల నుంచి ఉపశమనం కోసం చాలామంది మాత్రలు వేసుకుంటారు. ఈ కీళ్ల నొప్పులు మాత్రల గురించి పరిశోధకులు కొన్ని ఆసక్తికర  విషయాలను వెల్లడించారు. కీళ్ల నొప్పులు వచ్చిన వారు ఇలా మాత్రలు వేసుకోవడం వల్ల  అంతగా ప్రయోజనం ఏమీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. 

 

 

 

 అంతేకాకుండా కీళ్ల నొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల శరీరం పై  తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా చూపుతాయని తేల్చారు పరిశోధకులు. అయితే కీళ్ల నొప్పుల కోసం వేసుకునే  మాత్రలు  దీర్ఘకాలంలో నొప్పి ప్రభావం చూపదని తెలిపారు. దాదాపు 12 వేల మందిపై అధ్యయనం చేసిన తర్వాత ఈ  వివరాలను వెల్లడించారు. అత్యవసరమైనప్పుడు మాత్రమే  కీళ్లనొప్పులు మాత్రలు వేసుకోవాలి అని సూచిస్తున్నారు. ఇక కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం మాత్రల జోలికి వెళ్లకుండా   వ్యాయామం చేయడం కాచుకోవడం లాంటివి చేస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని సూచిస్తుంది. నొప్పి నివారణకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: