ఈ భూమి మీద చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. అందులో మల్బరీ కూడా ఒక‌టి. అయితే మ‌ల్బ‌రీ పండ్లు  తినే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగానే ఉంది. మన వాడుక భాషలో బొంత పండ్లుగా పిలుచుకునే ముల్బెర్రీలు మనకు గ్రామాలలో కన్పిస్తాయి.ఒకసారి తిన్నవారి మళ్లీ మళ్లీ తినాలన్పించేంత రుచి కలిగి ఉన్న ముల్బెర్రీలకు చాలా ఔషదగుణాలున్నాయి. ధమనులలో రక్తప్రసరణ రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కొన్నిసార్లు అడ్డంకులు ఏర్పడుతాయి. అయితే మల్బరీ ఆకుల నుండి తీసిన రసం ధమనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది.


రక్తంలోని షుగర్ లెవెల్స్ ని సమతుల్య పర్చడంలో ముల్బెర్రీలోని సమ్మెళనాలు దోహదం చేస్తాయి.షుగర్ లెవెల్స్ ని సాధారణ స్థితికి తీస్కురావడానికి చైనాలో ముల్బెర్రీలను ఔషదంగా వాడతారు. యాంటీఆక్సిడెంట్‌గా….. మల్బరీ వృక్షం ఆకులు, కాండం, పండ్లు ఫ్రీ రాడికల్స్ నుండి ఏర్పడే ప్రమాదాలను నివారిస్తాయి. వీటిల్లో ఉండే రెస్వెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వయసును తగ్గించడంలో దోహదపడతాయి. అంతేకాదు చర్మంపై ఏర్పడే ఎర్రమచ్చలను మల్బరీ ఆకుల రసం రాసినట్టయితే తగ్గుతుంది.


కర్కుమిన్ మరియు ముల్బెర్రీ ఆకులను కలిపి తయారు చేసిన మిశ్రమం చర్మంపై కలిగే దురదలను తగ్గిస్తుందని రొమేనియన్ అధ్యయనాల సమాచారం. పోషకాలకు నెలవుఎండిన మల్బరీ పండ్లలో ప్రోటీన్, విటమిన్ సి, కె, ఫైబర్, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా కూడా తినవచ్చు. ఒకవేళ పండ్లు రుచించకపోతే అంతే పోషకాలు ఉండే వీటి ఆకులను కూడా తినవచ్చు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల రోజంగా యాక్టీవ్ ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: