ప్రతి ఇంట్లోని వంటకాల్లో 'కరివేపాకు' లేనిదే రుచిరాదంటారు  అందుకే ప్రతి తాళింపులో కరివేపాకు ఉండవలసిందే. ఈ. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే చేదు రుచిని కలిగి ఉండే దీన్ని తింటానికి ఎవరూ ఇష్టపడరు. అధిక శాతం మంది భోజనం చేసేటప్పుడు దీన్ని ఆహారం నుంచి తీసివేయడం చూస్తుంటాం. అయితే దీన్ని తినడం వల్ల మాత్రం చాలానే లాభాలు ఉన్నాయంటారు పోషకాల నిపుణులు.


అవేంటంటే డయేరియాను నివారించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో, కరివేపాకు చక్కగా పనిచేస్తుందంటారు. కరివేపాకును రోజు ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చేస్తుంది. ఇకపోతే మనం రోజువారిగా తీసుకునే కరివేపాకులో విషం తాలూకూ అవశేషాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్ద పరిశీలనలో వెల్లడయ్యిందట. ఇదే కాకుండా  దేశవ్యాప్తంగా పలుశాంపిల్స్ సేకరించిన వారికి ఈ పరిశోధనల్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయని, మనం తినే ఆహారం, కూరగాయల్లో ఇంత విషం ఉందా అనే విధంగా కలుషితమయ్యాయి. అని పరిశోధకులు ఆశ్చర్యపోయారట.


ఇక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం  23వేల 660 నమూనాలు సేకరించి విశ్లేషించిగా అందులో 4 వేల 510 నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించాయట. అంటే  మనం రోజూ తినే ఆహారంలో 19.1 శాతం ఫుడ్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయి. ఇంకా ప్రమాదకరమేమంటే.. 523 నమూనాల్లో భారత ఆహార ప్రమాణాల సంస్థ నిర్దేశించిన దాని కంటే ఎక్కువుగా ఉన్నాయి. అంటే 2.2 శాతం ఫుడ్ యమ డేంజర్ అన్న మాట.


ఇక కరివేపాకు విషయానికి వస్తే ప్రతి కూరలో, పప్పులో, తాళింపులో వాడుతాం కదా కాని, దీనిలో కూడా పెస్టిసైడ్స్‌ను పరిశోధకులు గుర్తించారు. దీనికోసం కరివేపాకుకు సంబంధించి 616 నమూనాలను సేకరించి, పరిశోధించగా అందులో 438 నమూనాల్లో  పురుగు మందుల అవశేషాలను కనుగొన్నారు. అంటే మనం తినే కరివేపాకులో 50శాతంపైగా విషపూరితమైన ఆకులే ఉన్నాయన్న మాట. ఇలాగైతే ముందు ముందు ఆరోగ్యంగా మన పూర్వ కాలంలో ఉన్నారు అని పుస్తకాల్లో చదువుకోవలసి వస్తుంది అంటున్నారు ఈ విషయం తెలిసిన కొందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: