ఉరుకుల పరుగుల జీవితం ఈ జీవితంలో కనీసం పెళ్లి గురించి ఆలోచించే తీరిక ఉండడంలేదు నేటి యువతకి. ఎప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచన తప్ప పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఒకప్పుడు 25 లోపలే అయిపోయే అమ్మాయిల అబ్బాయిల  పెళ్లిళ్లు ఇప్పుడు మూడు పదులు దాటిన పెళ్లికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇక పెళ్లి అయిన వారు కూడా దాంపత్య జీవితం పై అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంపత్య జీవితం మెరుగు పడాలంటే విరివిగా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నప్పటికీ  కూడా... ఇప్పటికే కొంతమంది శృంగారం అంటే దూరంగానే ఉంటున్నారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఉరుకుల పరుగుల జీవితంలో డబ్బులు సంపాదించాలని ఆశలో  శృంగారంలో పాల్గొనాలనే ఆశలు కనుమరుగవుతుంది . రోజురోజుకు అబ్బాయిల్లో  కామవాంఛ సన్నగిల్లుతు వస్తుంది.

 

 

 

 కొంతమంది శృంగారంలో పాల్గొన్నప్పటికీ భాగస్వామిని సంతృప్తి పరచగలమా లేదా అని అనుమానంతో జీవిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం. రోజుకు 50 గ్రాములు జీడిపప్పు తీసుకుంటే శృంగార  ఆసక్తి మరింత పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 14 రోజుల పాటు జరిపిన పరిశోధనలో జీడీ పప్పు వాల్ నట్స్  తీసుకున్న వాళ్ళులో  శృంగార శక్తి, భావప్రాప్తి మెరుగు పడినట్లు తేలింది . రోజు జీడీ పప్పు, వాల్ నట్స్  తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని విషయం మాత్రమే అందరికీ తెలుసు... అంతే కాకుండా మేధోశక్తి పెంపొందించేందుకు కూడా జీడిపప్పు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

 

 

 

 డ్రై ఫ్రూట్స్ చేసే మేలు అంతాఇంతా కాదని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శృంగార జీవితం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. అంతే కాకుండా బరువు కూడా తగ్గవచ్చు తెలుపుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో పీచు అత్యవసర విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని  తెలిపిన పరిశోధకులు... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మనుషులు కామవాంఛను పెంచుతాయని చెబుతున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మనుషుల్లో శృంగార లోపాలను దూరం చేసి ... కామవాంఛను పెంచి శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తాయి అని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: