కొన్నాళ్ల క్రితం టీవీలో ఓ యాడ్ వచ్చేది.. ఓ బలమైన వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ కావాల్సినవి తింటుండేవారు.  ఎలాంటి వస్తువునైనా, ఎంతటి కష్టమైన పనినైనా సరే చిటికెలో చేస్తుంటాడు.  అలాంటి బలమైన వ్యక్తి సడెన్ గా హాస్పిటల్ బెడ్ పై కనిపిస్తాడు.  ఎందుకు అయన హాస్పిటల్లో పడుకున్నాడో తెలియదు.  ఏం జరిగిందో తెలుసుకునే లోపే డాక్టర్లు అతనికి వైద్యం చేస్తుంటారు.  అంతబలమైన వ్యక్తి ఇలా బెడ్ మీద ఎలా అంటే.. దోమకాటు వలన అని చెప్తాడు. అయితే, మీ ఇంట్లో హిట్ పెట్టుకోలేదా అని చెప్పడంతో యాడ్ ముగుస్తుంది.  


దాని అర్ధం ఏంటి దోమలను తరిమి కొట్టాలి అంటే హిట్ కొట్టాలి.  హిట్ వాడితే దోమలు ఉండవు.  దోమకాటు ఉండదు.. ఇలా హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అన్నది ఆ యాడ్ చెప్పాలి అనుకుంది.  ఇప్పుడు ఆ యాడ్ చెప్పినా చెప్పుకున్నా... ఇప్పుడు ప్రతి ఒక్కరు దోమల నుంచి రక్షణ పొందటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  దోమ కనిపిస్తే చాలు.. ఆమడదూరం పరుగుతులు తీస్తున్నారు.  


దోమకాటుకు దద్దుర్లు రావడం మాటేరుగు, జ్వరం వస్తే మంచాన పడాల్సి వస్తోంది.. మాములు జ్వరమైతే సరే అనుకోవచ్చు.. అది మామూలు జ్వరం కాదు.. డెంగ్యూ జ్వరం.  ఈ జ్వరంతో ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయి.  ఆసుపత్రులు ఈ రోజులతో కిటకిటలాడుతున్నాయి.  తెలంగాణాలో ఈ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇదిలా ఉంటె, ప్రపంచం మొత్తం నివ్వెరపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది.  


అదేమంటే.. డెంగ్యూ జ్వరం దోమ వలనే కాకుండా.. సెక్స్ వలన కూడా వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు.   స్పెయిన్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి డెంగ్యూ సోకినట్టు గుర్తించారు.  అతని సోకినా డెంగ్యూ దోమ వలన కాదని, సెక్స్ ద్వారా సోకిందని వైద్యులు దృవీకరించారు. ఇదిలా ఉంటె ప్రపంచంలో ఏటా ఈ డెంగ్యూ ద్వారా 10వేలమంది మరణిస్తున్నారు. దాదాపు పదికోట్ల మందికి డెంగ్యూ జ్వరం సోకుతున్నది.  ఈ డెంగ్యూ ఏడాదికేడాది పెరిగిపోతున్నది.  2080 నాటికి ప్రపంచంలోని 80%మంది ప్రజలు ఈ డెంగ్యూ బారిన పడతారని నిపుణులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: