ప్రపంచంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతున్నది.  ఒకప్పుడు పరిమితిగా ఉన్న జనాభా ఇప్పుడు దాదాపుగా 800 కోట్ల వరకు చేరుకుంది.  ఈ స్థాయిలో జనాభా పెరుగుదల ఉన్నది అంటే.. ప్రపంచంలో జనసాంద్రత ఎంతగా పెరిగినదో అర్ధం చేసుకోవచ్చు.  అయితే, ఇక్కడ విషయం ఏమిటంటే.. జనాభా పెరుగుదల అన్నది సమశీతోష్టస్థితి మండలాల్లోనే ఈ పెరుగుదల ఎక్కువ.  ఉష్టమండలాల్లో పెరుగుదల ఉన్నాయా.. పెద్దగా ఉండదు.  ఇక శీతోష్టస్థితి మండలాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది.  


అక్కడ జనాభా పెరుగుదల పెద్దగా ఉండదు.  చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మండలంలో నివసించే ప్రజల శరీరాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే.. చలి నుంచి తట్టుకోవాలి అంటే కొవ్వు అవసరం.  అయితే, మారుతున్న వాతావరణం, తీసుకుంటున్న ఆహరం, హైఫై లైఫ్ స్టైల్ కారణంగా మనిషి శరీరం తీరు మారుతున్నది.  శరీరంలో అనవసరంగా కొవ్వు పేరుకుపోతుంది..  


ఇలా కొవ్వు అనవసరంగా పేరుకుపోవడం వలన జనాలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.  ఊబకాయం వలన శరీరంలో తెలియని రోగాలు ఒకచోట గూడుకట్టుకుంటాయి.  అనవసరంగా కొవ్వు పేరుకుపోవడంతో.. హృదయానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి.  లేటెస్ట్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచంలో ఊబకాయం వలన మరణించే వారిసంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు.  ఊబకాయం వలన హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వస్తుంటాయి.  బిపి, షుగర్ వంటివి కూడా ఈ ఊబకాయం వలన వస్తుంది.  కేవలం తీసుకునే ఆహరం వలనే ఈ ఊబకాయం రాదు. ఊబకాయం రావడానికి ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి.  దేని వలన ఊబకాయం వస్తున్నదో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు.  నిర్లక్ష్యం చేస్తే.. అనారోగ్యంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: