ప్ర‌స్తుత స‌మాజంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం పాటూ మందులు వాడాల్సిందే. దీని కారణంగా తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాకుండా.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్‌లు తీసుకోవడం పెద్ద ప్రహసనం. ఇక దీంతో పాటు అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే ఆరోగ్య సమస్యలన్నింటికీ మెంతి టీతో చెక్‌ పెట్టవచ్చంటున్నారు న్యూట్రీషనిస్టులు.


ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. అయితే మెంతులు చేదుగా ఉంటాయి. అందువల్ల వంటకాలలో తక్కువ మోతాదులో వాడతారు. అయితే మెంతి గింజలతో తయారు చేసే తేనీరుతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అదే విధంగా పరగడుపున ఈ టీ తాగడం ద్వారా స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు.


అంతేగాక కడుపునొప్పితో బాధ పడేవారికి మెంతి టీ యాంటాసిడ్‌గా ఉపయోగపడి.. జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందని వెల్లడిస్తున్నారు. అలాగే మెంతుల‌తో పాటు మెంతి ఆకులు కూడా ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మెంతి ఆకుల్లో విటమిన్లు, లవణాలు అధిక పాళ్లలో ఉంటాయి. కాలేయం పనితీరు సరిగ్గా లేనివారు, జీర్ణాశయ సంబంధ సమస్యలున్న వారు మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: