సాధార‌ణంగా వంట చేసేట‌ప్పుడు లేదా ఏదైనా పండ్ల‌ను తినేట‌ప్పుడు తొక్క తీసేసి బ‌య‌ట పారేసి తింటుంటారు. తోక్క ప‌నికిరాద‌న్న గ‌ట్టి న‌మ్మ‌కంతో వాటిని లోకువ‌గా చూస్తాము. కానీ..  పండ్లకు, కూరగాయలపైన ఉండే తొక్కలోనే న్యూట్రీన్లు పుష్కలంగా ఉంటాయి.  కాకపోతే ఉపయోగించే ముందు నీళ్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగడం మాత్రం మర్చిపోవద్దు.  తొక్కపై ఉండే రసాయనాలు పూర్తిగా పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా పుచ్చకాయను ఎర్రగా ఉన్నగుజ్జును తింటాం. అడుగున ఉండే తెల్లటి పదార్ధంలో సెట్రులిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు, విటవిన్లు సి, ఎ, థయామిన్, రైబోప్లెవిన్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియంలాంటివి ఉంటాయి. ఆరెంజ్ తొక్క అద్భుతమైన బరువు తగ్గించే సహాయకారిగా ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, శ్వాసకోశ సమస్యలను తొలగిస్తాయి, మలబద్ధకం మరియు గుండెల్లో మంటను నివారిస్తాయి. బీరకాయ పొట్టులో పోషకాలు అధికం. దాని నుంచి లభించే పీచు మలబద్దకాన్ని తగ్గిస్తుంది.


బీరకాయ, సొరకాయ, లేత అరటికాయల పొట్టుతో పచ్చళ్లు చేసుకోవచ్చు. దానిమ్మ తొక్కలు మొటిమలు, మచ్చలు మరియు దద్దుర్లు, జుట్టు రాలడం మరియు చుండ్రును నివారించగలవు. అంతేకాకుండా, ఈ పై తొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గుండె జబ్బులు, గొంతు నొప్పి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. వంట గదిలో ఎప్పుడూ సమృద్ధిగా ఉండేవి ఆలూ. ఆలూ దుంపలపై ఉండే తొక్కలో విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్ పోషకాలుంటాయి. వీటిని తొక్క తీయ‌కుండా తింటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: