కీళ్ల నొప్పులు.. ఈ నొప్పుల భాద గురించి వృద్దులలో ఏ వృద్ధుడిని అడిగిన చెప్తారు. అంత బాధపెడుతుంటాయి ఈ కీళ్లనొప్పులు. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు ఇలా తదితర భాగాల్లో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటాక వస్తుండేవి. కానీ ఇప్పుడు యువతీ యువకులకు కూడా కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. 


ఇలా కీళ్లు నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆహార అలవాట్లు కావచ్చు, తాగే నీరు వల్ల కావచ్చు. అయితే కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే కీళ్లనొప్పులు తగ్గుతాయి. కీళ్లనొప్పులు తగ్గటానికి ఏ ఆహారం తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.  


అరటి పండు.. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఇక వీటిలో ఉండే మెగ్నిషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు కూడా అరటిపండ్లు తినడం వల్ల తగ్గుతాయి.


చేపలు.. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను పోగొడతాయి. కీళ్లను దృఢంగా చేస్తాయి. కనుక చేపలను వారంలో కనీసం మూడు సార్లు అయినా తింటే చాలు, కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


గ్రీన్‌ టీ.. గ్రీన్‌టీ చేదుగా ఉన్న ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి.  


ఆరెంజ్.. ఆరెంజ్ పండ్లను రోజూ తింటున్నా కీళ్ల నొప్పుల సమస్యను పోగొట్టుకోవచ్చు. వీటిల్లో ఉండే విటమిన్‌ సి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.


రాగులు, జొన్నలు, సజ్జలు.. రోజూ వీటిని తినాలి. అలా తింటే శరీరానికి కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.


రొయ్యలు.. రొయ్యలు తినాలి.. పచ్చి రొయ్యలు తింటే ఇంకా మంచిది. వీటిని కూరగా చేసుకుని తినవచ్చు. వీటిల్లో విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను పోగొడుతుంది.


పసుపు.. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక పసుపు నిత్యం ఒక గ్లాస్‌ పాలలో అర టీస్పూన్‌ మోతాదులో వేసుకుని తాగినా కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: