నేటి కాలంలో కంప్యూటర్, సెల్ ఫోన్ వంటి రకరకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎక్కువగా నియోగించడంతో, దానితో పాటు కొందరు రాత్రి పూట పని చేస్తుండడంతో ఎక్కువగా మానసిక ఒత్తిడి, టెన్షన్, నెగటివ్ థాట్స్ వంటి సమస్యలతో ఏ పని మీద సరిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అయితే అటువంటి సమస్యల నుండి విముక్తి పొందడానికి పలు రకాల మందులు కూడా వాడుతూ ఎక్కువగావ వాటికి బానిసలు అవుతున్నారు. అయితే అటువంటి సమస్యలకు ఒక సహజ సిద్దమైన వేరుతో చెక్ పెట్టవచ్చు అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వారు చెప్తున్న ప్రకారం, ఇటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలనుకునే వారు వట్టివేళ్ల నీరు వాడవచ్చని అంటున్నారు. 

శరీరంలోని వేడిమిని తగ్గించడంతో పాటు శరీరాన్ని శుద్ధి చేసి మనల్ని ఎప్పుడూ కూల్ గా ఉంచేందుకు ఈ వట్టి వేళ్ళు ప్రధమ స్థానంలో నిలుస్తాయట. నిజానికి ఈ వట్టి వేళ్ళ  వల్ల ఉపయోగాలు మనలో చాలామందికి తెలియవని, కాబట్టే ఇటువంటి సహజసిద్ధమైన వాటిని వదిలిపెట్టుకుని మనం మందుల బాట పడుతున్నాం అని అంటున్నారు. గడ్డి మాదిరిగా ఉండే ఈ మొక్క ఎక్కువగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో లభ్యమవుతుందట. ఇక ఈ వేళ్ళు మనకు కావాలంటే పచారీ సరుకులు దొరికే కొట్లలో లభ్యం అవుతుందని, అవి తెచ్చుకుని ఒక కుండ తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి, ఆ నీళ్లలో ఈ వట్టి వేళ్ళు వేసి కొన్నిగంటలపాటు నాననివ్వాలట. 

ఆ తరువాత వాటిని వడకట్టగా వచ్చిన నీరు తాగినట్లైతే, అది ముందుగా మన శరీరంలోని వేడిమిని తగ్గినచడంతో పాటు మనసు, మెదడును కూడా చల్లబరిచి ప్రశాంతంగా ఉండేలా చేస్తుందట. ఇక ఈ వట్టి వేళ్ళ నుండి తీసిన తైలంతో మన చర్మానికి మరియు జుట్టుకు ఎన్నో మేలు చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇక పలు రకాల మందుల్లో కూడా ఈ వేళ్ళను వాడుతుంటారని, అలానే ఇవి పూర్తిగా ఎండిపోయి సారం మొత్తం ఇంకిపోయిన తరువాత వీటితో పరుపులు చేస్తుంటారని, అటువంటి పరుపులు వాడడం వలన మన శరీరం కూడా ఎప్పుడూ సమోష్ణస్థితిలో ఉంటుందని, కాబట్టి వీలైతే అటువంటి పరుపులు కొనుక్కుని వాడుకొమ్మని సూచిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: