చాల మంది ఒళ్లునొప్పులతో బాగా భాద పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ మందే ఉంటారు అని తెలుస్తుంది.  దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాల మంచిది అని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఈ రోజు  వ్యాయామం చేసిన తరువాత బాధించే ఒళ్లునొప్పులకు పరిష్కార మార్గాలు గురించి తెలుసుకుందామా మరి... వ్యాయామం మొదటి సరి చేసే వారిలో ఒళ్ళునొప్పలు బాగా వేధిస్తాయి.  క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో కూడా కొన్నిసార్లు వ్యాయామం ముగించిన వెంటనే కండరాల నొప్పులు వేధిస్తాయి. ఆ సమయంలో పెయిన్‌ కిల్లర్స్‌ మీద ఆధారపడడం సరైన పని కాదు.


వ్యాయామం సమయంలో కండరాలు అలసటకు లోనై నొప్పులు తలెత్తడం సహజం. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవడం కోసం పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే మందులు వ్యాయామంతో అలసిన కండరాలకు ఏ విధంగానూ సహాయపడకపోగా, కండరాల ఎదుగుదల కుదించుకుపోయేలా చేస్తాయి. కాబట్టి కండరాల నొప్పులను తగ్గించుకోవడం కోసం వ్యాయామం తదనంతరం తప్పనిసరిగా స్ట్రెచింగ్‌ చేయాలి. అలాగే ఎలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందైనా, అందుకు శరీరాన్ని సన్నద్ధం చేయడం కోసం వార్మప్‌ చేయాలి.


ఇవన్నీ అనుభవజ్ఞులైన వ్యాయామ శిక్షకుల పర్యవేక్షణలో సాగాలి. వ్యాయామంతో అలసిన కండరాలు తిరిగి శక్తిని పుంజుకోవాలంటే మాంసకృత్తులు సరిపడా తీసుకోవాలి.వ్యాయామం ముగించిన తర్వాత బలవర్థకమైన, మాంసకృత్తులతో కూడిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా కూడా నొప్పులు తలెత్తకుండా సులువుగా చేసుకోవచ్చు.

అలాగే ఏ కాలమైనా గోరు వెచ్చని నీళ్లు తాగడం వలన ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నడుమునొప్పికి ముఖ్యమైన కారణం మారిన జీవన శైలి విధానమే అని  నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో దీనిని అధికమించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: