గొంతు నొప్పి, గొంతులో అసౌకర్యం లేదా గొంతులో దురద ఇలాంటి సమస్యలతో ఎంతో మంది బాధ‌ప‌డుతుంటారు. ఆహారంలో తేడాలు, కాలుష్యం, వాతావరణంలో మార్పులు, తాగేనీటిలో తేడాల వలన గొంతు సమస్యలు వస్తుంటాయి. ఆహార పానీయాలు తీసుకోవడం దగ్గర నుండి, మాట్లాడేవరకు ప్రతిఒక్క విషయంలోనూ దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తూ, అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే గొంతు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి వాటిపై ఓ లుక్కేసేయండి..


- మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తాగడం, లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి సేవించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల‌ గొంతు సమస్యలు సులువుగా తగ్గుతాయి.


- గొంతు సమస్యలకు తేనెను మించిన ఔషధం లేదు. ఎంత తీవ్రమైన గొంతు నొప్పి అయినా అల్లం టీ లేదా హెర్బల్‌ టీలో కాస్త తేనె వేసి తాగితేవెంటనే తగ్గుతుంది.


- గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీని గాని అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


- గొంతు జలుబు ఉందని వెనకాడకుండా నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్ల రసాలు తీసుకోవాలి. విటమిన్ సి మూలంగా గొంతు సమస్యలు ఉపశమించటమే గాక శరీరానికి తగినంత రోగనిరోధక శక్తి చేకూరి ఎలర్జీలు కూడా దరిజేరవు.


- దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. 


- రోజు గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు లేదా సోడా ఉప్పు వేసి కలిపి ఆ నీటితో బాగా పుక్కిలిస్తే గొంతులో పేరుకున్న శ్లేష్మము, కఫము కొద్దీ కొద్దిగా బయటకు పోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: