పైల్స్, హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా ఉంటుంది. వీటితో బాధపడేవారి పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చని మీకు తెలుసా.. అయితే అవేంటో ఓసారి చూద్దాం...

 

1) త్రిఫల చూర్ణం పొడి: మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. అలాగే పైల్స్ కూడా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

 

2) ఆముదం నూనె: ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా అలాగే వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది.

 

3) రాత్రిపూట అధిక భోజనం వద్దు : మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకి మూలం మన ఆహారపద్ధతులే. మొలలను కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి. అందుకు తగ్గ ఆహారాన్నే తీసుకోవాలి. 

 

4) నీరు ఎక్కువగా తాగడం : పైల్స్ ని అరికట్టడానికి ఇది చాలా సులభ పద్ధతి. సరిపడినంత నీరు తీసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వలన ప్రేగులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ నీరు తాగటం వలన మలబద్ధకం, దాని ద్వారా పైల్స్ రెండూ కూడా బయటపడ వచ్చు.

 

5) సలాడ్లు : మొలలతో బాధపడేవారు... ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే దోసకాయ వంటి సలాడ్లను తినమని వైద్యులు సూచనలు ఇస్తూ ఉంటారు. క్యారట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి, ఇవి మొలలను తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది. 

 

6) ఇంగువ : మొలల సమస్య ఉన్నవారిని రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం మంచిది. అది కూరల్లోనైనా వేసుకోవచ్చు. లేదా గ్లాసు నీటిలోనైనా కలుపుకుని తీసుకొనవచు.

మరింత సమాచారం తెలుసుకోండి: