పెయిన్ కిల్లర్ .. ఏ చిన్న నొప్పి వచ్చిన ఈ మాత్రలను వేసుకుంటుంటారు మన పెద్దలు. ఇంకా మనం అయితే మోకాళ్ళ నొప్పులు వచ్చిన, కీళ్ల నొప్పులు వచ్చిన ఇలా ఏ రకమైన నొప్పులు వచ్చిన సరే పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇవి తక్షణమే ఉపశమనం కల్గిస్తాయి. 

                     

అయితే ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. ఇంకా విషయానికి వస్తే.. వయసు మళ్లిన వారు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రకమైన పెయిన్ కిల్లర్స్ మాత్రలను వాడుతుండటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ మాత్రలు ధీర్ఘకాలంలో నొప్పిపై అంతగా ప్రభావం చూపవని పరిశోధకులు చెబుతున్నారు.

                        
అదే సమయంలో శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా ఉంటాయని, అత్యవసరమైతే తప్పా ఈ రకమైన మాత్రలను వాడకూడదు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మొత్తం పన్నెండు వేల మందిపై అధ్యయనం అనంతరం ఈ వివరాలను ఇలా తెలిపారు. ఇలా తరచూ మాత్రలు ఉపయోగించడం కన్నా యోగ, వ్యాయామం, కాచుకోవడం లాంటి వాటి వలన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.

                                   

మరి చూశారుగా.. ఈ పెయిన్ కిల్లర్స్ ఎందుకు ఉపయోగించకూడదు అనేది. అందుకే పెయిన్ కిల్లర్స్ ఉపయోగించడం అపి ఆరోగ్యాన్ని సహజసిద్ధంగా కాపాడుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేదు అంటే అతి తక్కువసమయంలోనే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: