మిరపకాయలు లేని వంటను ఊహించుకోవడం కష్టమే! ఆహారపదార్థాల్లో కారం ఎక్కువగా వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటే మనిషికి లాంగ్‌ లైఫ్‌ ఇస్తుందని అంటున్నారు పరిశోధకులు. ఇదిలా ఉంటే బిజీ బిజీ లైఫ్‌లో వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం తదితర కారణాలతో చాలామంది బరువు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక బరువు కారణంగా ఊబకాయ సమస్యలు తలెత్తి జీవితాంతం అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటున్నారు. 

 

అయితే కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అధికబరువు సమస్య నుంచి కొంతవరూ తప్పించుకోవచ్చునని పరిశోధనలు తేల్చాయి. ఇటీవ‌ల జ‌రిపిన‌ పరిశోధనల్లో పండు మిరపకాయలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అన్న విషయం స్పష్టమైంది. పండుమిరపకాయలు ఎక్కువగా తినే వారిలో తక్కువ ఆరోగ్య సమస్యలు కనిపించగా, తక్కువ తీసుకునే వారిలో గుండెపోటు వంటి సమస్యలను గుర్తించారు.

 

అయితే ఎక్కువ తినడం వలనే దీర్ఘాయుష్షు సాధ్యమన్న విషయాన్ని స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పరిశోధన‌లో తెలిసింది. అలాగే  మిరపకాయలోని క్యాప్సైసిన్, డీహైడ్రోక్యాప్సైసిన్‌లుండటం వలన బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచి ధమనుల గోడలలో పేరుకుపోయి ఉన్న కొవ్వును ఇది తొలగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: