పుదీనా దీన్ని వంటింట్లో విరివిగా వాడుతుంటారు. ఘుమఘుమలాడే వంటకాలు చేయాలంటే పుదీనా ఉండాల్సిందే. అయితే ఈ పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది.ఈ పుదీనాతో చర్మాన్ని మెరిపించొచ్చు. మచ్చలనూ తొలగించుకోవచ్చు.

 

మొటిమలు తగ్గిపోయినా వాటి గుర్తులుగా మచ్చలు మిగిలిపోతాయి. అంతే కాదు. దోమకాటు వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి మనకు పుదీనా పనికొస్తుంది. ఎలాగంటే.. పుదీనా ఆకులను ముద్దలా చేసి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపాలి. ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

పుదీనాతో కాస్త వయస్సు తగ్గించుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకోవడమే. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే.. వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయి. ఈ పుదీనా పూత రక్త ప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది. అంతే కాదు.. కంటి కింద నల్లటి వలయాల సమస్య అదుపులోకి వస్తుంది.

 

పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్ టీ వేసి మిశ్రమంలా చేసి దీన్ని చేతులు,మెడకు పూతలా వేస్తే... కాలుష్యం కారణంగా పేరుకున్న మురికి వదిలిపోతుంది. చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: