కోడిగుడ్డు తినని వారు ఎవరైన ఉన్నారా ? ఉండరు ఎందుకంటే గుడ్దు మంచి పోషకాల గని అని ఆరోగ్యనిపుణులు మరి చెబుతారు. అందుకే ఈ కాలంలో దాదాపుగా నాన్ వెజ్ తినని వారు కూడా కనీసం కోడి గుడ్డునైనా తింటారు. ఇకపోతే  బోలెడు పోషకాలు ఉంటాయనీ అది అనేక వ్యాధుల్ని అడ్డుకుంటుందని గుడ్దు తినే వారికి ఓ షాక్ న్యూస్  అదేమంటే ఎవరు కనిపెట్టారో తెలియదుగానీ అనారోగ్యాన్ని కలిగించే కృత్రిమ గుడ్లనీ చైనాలో తయారుచేస్తున్నారట కొందరు. వింతగా ఉన్నా ఇది నిజం. చూడ్డానికి అచ్చం మామూలు గుడ్లలానే ఉండటంతో తెలియక వాటిని జనం కొంటున్నారట.

 

 

అవి దేశ సరిహద్దులు దాటుకుని సింగపూర్‌, ఉగాండాతో పాటుగా, మనదేశంలోకీ వచ్చాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు గుడ్లు తినే వారు కొంచెం జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందనే అనిపిస్తుంది.. ఇకపోతే కృత్రిమ కోడిగుడ్ల పెంకుని కాల్షియం కార్బొనేట్‌తో చేస్తే, అందులోని తెల్ల, పచ్చ సొనల్ని సోడియం ఆల్జినేట్‌, ఆలమ్‌, జెలాటిన్‌, తినే కాల్షియం క్లోరైడ్‌, మంచినీళ్లు, రంగులను వాడి తయారుచేస్తున్నారు. సాధారణంగా సోడియం ఆల్జినేట్‌ అనే పదార్థాన్ని గోధుమరంగు ఆల్గే నుంచి సేకరిస్తారు.

 

 

ముందుగా ఈ సోడియం ఆల్జినేట్‌ను గోరువెచ్చని నీళ్లలో కలిపి, అందులోనే కాస్త జెలాటిన్‌, బెంజాయిక్‌ ఆమ్లం, ఆలమ్‌... వంటివన్నీ వేస్తే తెల్లసొన తయారవుతుంది. ఈ మిశ్రమాన్నే కొంత విడిగా తీసుకుని కాస్త పసుపు రంగుని కలిపితే అదే పచ్చసొన. ఇప్పుడు కోడిగుడ్డు ఆకారంలోని మౌల్డ్స్‌ తీసుకుని వాటిల్లో తెల్లసొన మిశ్రమాన్ని పోస్తారు. వాటి మధ్యలోకి పసుపు రంగుని కలిపిన మిశ్రమాన్ని పోసి, ఆపై వీటిమీద కాల్షియం క్లోరైడ్‌ని పోస్తే పెంకులోపల ఉండే పొర ఏర్పడుతుంది. ఇలా తయారైన గుడ్డును పారఫిన్‌ వ్యాక్స్‌, జిప్సమ్‌ పొడి, కాల్షియం కార్బొనేట్‌ వంటివన్నీ కలిపిన మిశ్రమంలో ఒకటికి పదిసార్లు ముంచి, సొన చుట్టూ పెంకు ఏర్పడేలా చేసి, చూసేవాళ్లకు ఇవి నిజమైన గుడ్లేనా అన్న భ్రమను కలిగిస్తున్నారు.

 

 

ఇక  ఈ కృత్రిమ గుడ్లలో వాడేవన్నీ రసాయనాలే గనుక ఈ నకిలీ గుడ్లలో వాడేవి ఏవీ ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు కావు అన్నది నిజం. ఇకపోతే దీనిని గుర్తించడం కొంచెం కష్టమైనా ప్రయత్నిస్తే పసిగట్టవచ్చూ. అదెలా అంటే సాదా గుడ్లతో పోలిస్తే నకిలీ గుడ్ల పెంకులు కాస్త మెరుస్తుంటాయి కానీ దాన్ని అంత సులభంగా గుర్తించలేం. పట్టుకున్నప్పుడు మాత్రం కాస్త గరుకుగా ఉంటుందట. గుడ్డు పెంకుమీద చాకు లేదా గోటితో చిన్నగా కొట్టినప్పుడు ఠంగుమనే శబ్దం మామూలు గుడ్డుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కానీ షేక్‌ చేసినప్పుడు మాత్రం ఒకలాంటి శబ్దం వస్తుంది.

 

 

మామూలు కోడిగుడ్డులా దీనికి నీచు వాసన ఉండదు. అలాగే పగలకొట్టగానే తెల్లసొన, పచ్చసొనా రెండూ ఒకదాంట్లో ఒకటి వేగంగా కలిసిపోతాయి. అదే మామూలు గుడ్డులో పచ్చసొన తేలిగ్గా తెల్లసొనలో కరగదు. ఇదే కాకుండా పెంకుని పగులకొట్టడం కాస్త కష్టంగా ఉండటంతో బాటు అందులోని సొన ఉడికాక కాస్త రబ్బరులా సాగినప్పటికీ రుచిగానే ఉంటుందట. అందుకే వాటిని ఉత్పత్తిదారులు అంత ధైర్యంగా తయారుచేసి అమ్మేస్తున్నారు. ఏమైనాగానీ దేనికైనా నకిలీల్ని సృష్టించగల చైనాలో అందరికీ అందుబాటులో దొరికే కోడిగుడ్డును సైతం తయారుచేయడం దురదృష్టకరం. ఇలాంటివి తింటే మాత్రం త్వరగా అనారోగ్యాల బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: