గుండెపోటు వ‌చ్చిందంటే...ఆ వ్య‌క్తి ట‌పా క‌ట్టేయ‌డం ఖాయ‌మే. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు నిలుపుకోగలిగినా.. జీవితాంతం మళ్లీ ఆ సమస్య రాకుండా చూసుకోవాలి. అయితే, ప్రాణాలు తీసే గుండెపోటు విష‌యంలో..ఓ సంచ‌ల‌న స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే వారాంతాల్లో కంటే ప‌నిదినాల్లో గుండెపోటు వ‌స్తే..బ్ర‌తికే అవ‌కాశం ఎక్కువ‌ట‌.

ఫిలడెల్ఫియాలో ఇటీవల జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ సైన్స్ సింపోజియం 2019 సదస్సులో యూకేకు చెందిన పలువురు పరిశోధకులు సర్వైవల్-టు-హాస్పిటల్ అడ్మిషన్ అనే అంశంపై చేపట్టిన పరిశోధనకు చెందిన వివరాలను వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజులోనైనా సరే.. గుండెపోటు వచ్చిన వారితో పోలిస్తే శని, ఆది వారాల్లో గుండె పోటు వచ్చిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువని త‌మ‌ పరిశోధనల్లో వెల్లడైందని సైంటిస్టులు ప్ర‌క‌టించారు.

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3వేల మందికి చెందిన డేటాను సేకరించి విశ్లేషించి ఈ క్రమంలో వచ్చిన ఫలితాలను బట్టి తాము నూత‌న విష‌యాన్ని చెప్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇతర రోజుల్లో కన్నా శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మధ్య గుండె పోటు వచ్చిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే బతికారని తేలింద‌ని పేర్కొన్నా. అయితే, వయస్సు పెరిగే కొద్దీ ఈ శాతం మరింత తగ్గుతుందని వారు తెలిపారు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం. 

 

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. హార్ట్ ఎటాక్స్ రావ‌డానికి అనేక కారణాలుంటున్నాయి. అయితే, రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ క్రమంలో అలా హార్ట్ ఎటాక్స్ రాకుండా, ఇతర గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: