అవును మీరు చదివింది నిజమే! మొన్నటి వరకు నకిలీ పాలను చూసాం.. ఇప్పుడు నకిలీ గుడ్లను చూడబోతున్నాం. పాలు, గ్రుడ్లు అనేవి మనం తరచుగా ఆహారంగా స్వీకరించే పదార్థాలు. అందుకే ఇప్పుడు కొంతమంది కేటుగాళ్లు ఎక్కువగా పాల మీద ఏకాగ్రత పెట్టి నకిలీ పాలను తయారుచేస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసినదే. ఇప్పుడు ఈ నకిలీ ఆహారాల జాబితాలోకి గుడ్లు కూడా చేరాయి.

వివరాల్లోకి వెళితే, కొన్ని లక్షల నకిలీ గుడ్లు చైనాలో తయారయ్యి... ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఈ నకిలీ గుడ్లు ఎక్కువగా సింగపూర్, ఉగాండా దేశాలకు వెళ్తున్నాయి. దురదృష్టమేమిటంటే, ఈ నకిలీ గుడ్లు పైకి చూడ్డానికి అచ్చం కోడి నుంచి వచ్చిన గుడ్ల వలె ఉంటున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ నకిలీ గుడ్లు నిజమైన గుడ్ల కంటే చాలా టేస్ట్ గా ఉండటం వలన.. అవి నకిలీవనిి తెలియని ప్రజలు... వీటిని కొనడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఇది ఎలా తయారు అవుతాయి అంటే... గుడ్డు పెంకును కాల్షియం కార్బొనేట్‌తో తయారుచేస్తున్నారు. లోపలి పచ్చ సొన, తెల్ల సొనను సోడియం ఆల్జినేట్, ఆలం, జెలాటిన్, కాల్షియం క్లోరైడ్, వాటర్, కలర్స్‌తో వాటిని తయారుచేస్తున్నారు. 


అంతా రెడీ అయ్యాక... గుడ్డు ఆకారంలోని మౌల్డ్స్‌లో ఆ మిశ్రమాన్ని పోస్తున్నారు. తద్వారా... మిశ్రమంపైనే ఓ పొరలాగా ఏర్పడుతుంది. ఇప్పుడా పొరతో కూడిన బంతిలాంటి పదార్థాన్ని... పారఫిన్‌ వ్యాక్స్‌, జిప్సమ్‌ పొడి, కాల్షియం కార్బొనేట్‌ వంటి వాటితో కలిపిన మిశ్రమంలో ముంచుతూ, తీస్తూ ఉంటే... కోడిగుడ్డులాంటి పై పెంకు తయారవుతుంది. అలా తయారైన గుడ్డు అచ్చం నిజమైన గుడ్డు లాగానే ఉంటుంది. ఇలా గుడ్డుని తయారు చేయాలంటే కేవలం ఐదు నిమిషాలు కూడా పట్టదని సమాచారం. సాధారణంగా ఒక గుడ్డు ధర ఐదు రూపాయలు ఉంటుంది కానీ ఈ నకిలీ గుడ్డు ధర రెండు రూపాయలే. ఈ ఫేక్ గుడ్లను... ఒక వ్యక్తి కొన్ని వందల కొద్దీ రోజుకి తయారు చేయవచ్చు. దాంతో ఈ కృత్రిమ గుడ్లు ఎక్కువగా తయారయ్యి.. ఇండియా లోకి ప్రవేశిస్తున్న సమాచారం. కేవలం రసాయనాలతో తయారయ్యే ఈ గుడ్లు తింటే.. ప్రాణ హాని కలుగుతుందని ఆహార అధికారులు చెప్తున్నారు.


నకిలీ గుడ్లను ఎలా తెలుసుకోవాలంటే... గుడ్డును పగలకొట్టిన తర్వాత గుడ్డులోని రసం నెమ్మదిగా కదులుతుంది... ఇంకా ఆ గుడ్డులోని సొన అసలు ఏ వాసన రాదు. తెల్ల సొన, పచ్చ సొన రెండూ కలిసిపోయి ఉంటాయి. మనం తినే గుడ్డులోని తెల్లసొన పచ్చ సొన రెండు విడివిడిగా ఉంటాయి. వాటిని కలపాలన్న కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నకిలీ గుడ్లలో అలాంటివి ఏమీ ఉండవు.... రెండు సొనలు కలిసే ఉంటాయి. ఈ ఒకటి మీరు గమనించి.. ఏది మంచిదో ఏది నకిలీవో తెలుసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: