నడివయస్సుకు వచ్చినా కుర్రవాళ్లలా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అందుకేనేమో. వయ్సస్సు 40 దాటిందంటే చాలా మంది తాము పెద్దవాళ్లమవుతున్నామని ఫీలవుతారు. వయస్సు దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. వయస్సు కనిపించకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య పద్దతులు పాటించాలి.

 

పని ఒత్తిడి శరీరంలో ఆండినలైన్‌, కోర్టిజాల్‌ వంటి హార్మోన్ల విడుదల అధికమై గుండెవేగం పెరిగి హైపర్‌ టెన్షన్‌కు దారితీస్తుంది. ఒత్తిడిని సాధ్యమైనంతమేర తగ్గించుకోవడంతోపాటు సంతోషంగా, ఆరోగ్యంగా జీవితం గడపాలి. అందుకోసం ధ్యానం లేదా యోగాను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 8 గ్లాసుల నీళ్ళు, 8 గంటల నిద్ర చాలా అవసరం.

 

డీ హైడ్రేషన్‌ వల్ల కూడా చర్మం ఎండిపోయి ముడతలు పడుతుంది. అది శరీరంలో శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్ళను తాగాలి. జీవిత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 6 – 8 గంటలు నిద్రపోవాలి. చక్కటి నిద్ర రోజంతా ఉత్సాహాన్నిస్తుంది. ఆహారంలోకి తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుకోండి.

 

వీటిల్లో యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మం వయస్సు పెరుగుదల ప్రక్రియ మందగించి, చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. విటమిడ్ డి చర్మానికి ఆరోగ్యాన్నివ్వడమే కాదు, వృద్ధాప్యఛాయల్ని నివారిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: