ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫిట్‌నెస్‌ కోసం చాల కష్టాలు పడుతుంటారు. అలాగే మధ్యవయసు వారు ఫిట్‌నెస్‌ కోసం ఏమి చేయాలో తెలుసుకుందామా మరి. మధ్య వయసువారు సాధారణంగా ఫిట్‌నెస్‌ అనగానే ఇది మనకు సంబంధించినది కాదులే అని అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఫిట్‌నెస్‌ అనేది ఏ వయసు వారికైనా అవసరమే అని నిపుణులు తెలుపుతుంటారు.

 

అందుకే  ఈ సమాచారం మధ్యవయసు వారికోసం...  మధ్య వయసువారు ప్రతీ రోజూ వ్యాయామం చేయకుండా టీవీ చూస్తూ గడుపుతున్నారా... అయితే మీ మెదడు పరిమాణం తగ్గడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఫిట్‌నెస్‌కు మెదడు పరిమాణానికి మధ్య సంబంధముందని కొన్ని పరిశోధనలో కూడా తేలింది.

 

Image result for ఫిట్‌నెస్‌  కోసం  ఇలా చేయండి..

 

40 ఏళ్ల వయసు గల 15వేల మందికి ట్రేడ్ మిల్ టెస్ట్ జరపగా వారిలో వ్యాయామం చేయని వారు హృద్రోగాలు, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. వ్యాయామం చేయని మధ్యవయసు వారికి ఎమ్మారై చేయించగా వారి మెదడు పరిమాణం తగ్గిందని తేలింది. అందుకే వ్యాయామం చేయని మధ్యవయసు వారు మెదడు పరిమాణం తగ్గడంతోపాటు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు తేల్చారు.

 

కాబట్టి వ్యాయామం చేయకుండా టీవీలకు అతుక్కు పోయేవారు ఇక వాటికి స్వస్తి చెప్పి ఫిట్‌నెస్‌ కు ప్రాధాన్యమివ్వాలని పరిశోధకులు సూచించారు.  
ఇక మధ్యవయసు వారు చేయదగిన వ్యాయామాలు. మధ్యవయసు వారికీ అన్నింటికన్నా నడక చక్కని వ్యాయామం. ఇక సమయం దొరికి వీలైతే యోగా చేయవచ్చు. యోగాతో ఫిట్‌నెస్‌తో బాటు మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. అంతేకాదు క్రమం తప్పకుండ యోగా చేయడం వలన అనేక వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. ఇక బాడీ ఫిట్ గా ఉంటే రోగాలు కూడా దరిచేరవు. వృద్ధాప్యానికి స్వాగతం వంటి మధ్యవయసులో  ఫిట్‌నెస్‌ మీద ధ్యాస పెడితే వర్ద్యాన్ని హాయిగా గడిపేయవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: