వాస్తవానికి  పచ్చి గుడ్డు మంచిదేనా..పచ్చి గుడ్డుని తినడం మంచిదేనా అనే చర్చ చేస్తూనే ఉంటారు అందరు. ఇది ఎంత వరకు మంచిదంటే.. నిజానికీ పచ్చి కోడి గుడ్లలో సాల్మొనెల్లా అనే ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. ఇది తక్కువ మోతాదులోనే ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బంది లేదు అనే చెప్పాలి. కానీ, రోగ నిరోధక శక్తి ఉన్నవారికి కాస్తా ఇబ్బంది అని తెలుపుతూ ఉంటారు నిపుణులు. ఎందుకంటే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలో కొన్ని సమస్యలను వస్తాయి అని అంటున్నారు. అలా అని ఇలా పచ్చిగా తినడం పెద్ద ప్రమాదం ఏం కాదని తెలుపుతూ ఉంటారు నిపుణులు. 

 

​ఇక ఉడికించిన కోడిగుడ్లతో ప్రయోజనాలు చూద్దామా మరి..ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి అన్ని వయసుల వారికి బాగా  మేలు చేస్తాయి. రోజూ గుడ్డుని తినడం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ఎక్కువగా లభిస్తాయి అంటే నమ్మండి. ఇందులో కాల్షియం, ఐరన్ శాతాలు కూడా  ఎక్కువ గానే ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, బి5, బి12, బి2, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు, 77 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి. దీనిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా.. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ అదుపులోకి వస్తుంది.

 

Image result for egg

 

ఇలా  ఉడికించిన గుడ్డుతో గుండె సమస్యలు దూరం అవుతాయి ..రోజూ ఉడికించిన గుడ్డు తినడం వల్ల రక్తసరఫరా బాగా మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెంపొందుతుంది. రక్త పోటు అదుపులో ఉండి గుండె సంబంధిత సమస్యలు అసలు దారికి రావు అంటే నమ్మండి.  కంటి సమస్యలతో బాధపడేవారికి గుడ్డుకి చక్కని ఆహారం.. దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్‌ని తగ్గించడంలో కూడా గుడ్డులోని ప్రోటీన్స్ బాగా సహాయ పడుతాయి.

 

​గుడ్డు తినకపోవడం వల్ల కలిగే నష్టాలు.. కొంతమంది గుడ్డుని తీసుకునేందుకు అంతగా ఇష్ట పడరు. దీంతో.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి.. డయాబెటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి అని నిపుణులు తెలుపు ఉంటారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గుడ్డుని రోజూ తినడం అలవాటు చేసుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడు కొండి అని  నిపుణులు తెలుపుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: