నారింజ పండ్లు ఎన్ని తిన్న సరే చక్కగా జీర్ణం చేసుకోగలం. ఆరెంజ్ రంగులు చూడగానే తినేయాలని, జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు. ఈ నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను తగ్గిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. 

            

మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. అయితే నారింజ పండు క్రమం తప్పకుండ తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

             

నారింజ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

        

యాన్తి ఆక్సిడెంట్లు, విటమిన్ 'సి' ఎక్కువగా ఉంటాయి కనుక డయాబెటిస్ కూడా రోజు ఒక నారింజ పండు తినవచ్చు. 

           

నారింజ పండు తింటే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. 

             

పేద పేగులో వచ్చే క్యాన్సర్లను నిరోధిస్తుంది. 

      

ఈ పండ్లలో ఉండే పొటాషియం, కాల్షియం రక్తపోటును నియంత్రిస్తుంది. 

              

నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉంటాయి. 

          

జ్వరం వచ్చిన సమయంలో జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే, దేహానికి కావలసిన రీతిగా అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. 

       

ఆహారనాళ్ళలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని చంపేస్తుంది. 

   

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం రెండు పండ్లను తింటే మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: