గుడ్డు ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు.  గుడ్డు ఆరోగ్యానికి మేల‌ని, విశ్వంలో అతి ఎక్కవ పోషక విలువులు లభించే ఆహార పదార్థం కేవలం గుడ్డు మాత్రమే అని అంటున్నారు నిపుణులు.  ప్రతీరోజూ కోడి గుడ్డు తినడం వలన అందులో విటమిన్లు ఎ, డి, ఇ ల వలన  మన ఆరోగ్య నికి చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి శరీరానికి మంచి ఆరోగ్యం చేకూరుది. ప్రతి రోజూ ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు 12 శాతం తగ్గుతాయట. 

 

అయితే మనం అందరం సాధారణంగా చేసే తప్పు ఏంటో తెలుసా... కోడిగుడ్లను ఫ్రిజ్‌లలో స్టోర్ చేయడం. ఇలా స్టోర్ చేయడం వల్ల గుడ్లు త్వరగా పాడవ్వవని భావిస్తుంటాం. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. అలా ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను కూడా అస్స‌లు తిన‌రాద‌ట‌. ఎందుకో ఇప్పుడు చూద్దాం.. ఎందుకంటే గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడితే అవి త్వ‌ర‌గా పాడ‌వుతాయ‌ట‌. త్వ‌ర‌గా కుళ్లిపోతాయ‌ట‌. దీంతోపాటు ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల పెంకుల‌పై బాక్టీరియా పెద్ద మొత్తంలో చేరుతుంద‌ట‌. 

 

ఈ క్ర‌మంలో అలాంటి గుడ్ల‌ను తింటే అనారోగ్యాల బారిన ప‌డ‌తామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్లు త‌మ స‌హ‌జ‌సిద్ధ‌మైన‌ రుచిని కోల్పోతాయి. పుల్ల‌గా మారుతాయి. దీనికి తోడు వాటిలో ఉండే పోష‌కాలు కూడా న‌శిస్తాయ‌ట‌. క‌నుక ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌రాద‌ని అంటున్నారు నిపుణులు. కాబట్టి జాగ్ర‌త్త‌… ఇక‌పై మీరు గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కండి. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌నూ తిన‌కండి. సో.. గుడ్ల‌ను మార్కెట్ నుంచి తెచ్చిన వెంట‌నే ఒక‌టి, రెండు రోజుల్లో వాడేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: