సాధారంగా చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్‌లోనే గాలిలో తేమ బాగా తగ్గడం జరుగుతుంది. ఇలా అవ్వడం వల్ల ప్రధానంగా చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు బాగా వస్తాయి. ఈ కాలంలో డ్రై స్కిన్‌ ఉన్నవారికి  ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఇక జిడ్డు చర్మం  వారికీ అసలు సమస్యలు తప్పవు అంటే నమ్మండి. 

 

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని చలికాలంలో కాపాడుకోవచ్చని నిపుణులు తెలియ చేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందామా మరి... మొదట గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం చాలా అవసరం. ఈ చలి కాలంలో  అమ్ముతున్నారని ఏవేవో క్రీములు ముఖంపై, శరీరంపై రాసుకుంటే మొదటికే మోసం వస్తుంది. చర్మతత్వాన్ని బట్టి క్రీమ్‌ని ఎంచుకొని ఉపయోగించాలి.

 

 సాధ్యమైనంత వరకూ చలిలో చర్మాన్ని ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దుమ్ము, ధూళికి  చాల దూరం ఉండడం మంచిది. పౌడర్ల జోలికి వెళ్లకుండా ఉండడం చాల మేలు.  రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా ఉంటుంది. ముఖ్యంగా  కండరాలు ఉత్తేజితం అవుతాయి.

 

ఇంకా...గులాబీనీరూ, తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం, మెడకు రాసుకోవడం వల్ల బాగా కాపాడుకోవచ్చు. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మానికి తేమ నందిస్తుంది. పొడిచర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది అని  నిపుణులు తెలియ చేస్తున్నారు.

 

కొందరికి   చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం సమస్య బాగా కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధ పడే వారు  టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు, అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రిళ్లు పాదాలకు రాసుకుని, సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు నుంచి సులువుగా బయట పడవచ్చు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: